మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Ashtalakshmi stotram – అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మీ –
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || 1 ||
ధాన్యలక్ష్మీ –
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || 2 ||
ధైర్యలక్ష్మీ –
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || 3 ||
గజలక్ష్మీ –
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే
రథగజ తురగపదాది సమావృత పరిజనమండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాపనివారణ పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 4 ||
సంతానలక్ష్మీ –
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే |
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || 5 ||
విజయలక్ష్మీ –
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే
అనుదినమర్చిత కుంకుమధూసరభూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || 6 ||
విద్యాలక్ష్మీ –
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే |
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || 7 ||
ధనలక్ష్మీ –
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే |
వేదపురాణేతిహాస సుపూజిత వైదికమార్గ ప్రదర్శయుతే
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || 8 ||
ఇతి అష్టలక్ష్మీ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.